గిరిజనులకు మెరుగైన వైద్యం
డుంబ్రిగుడ మండలం రంగుల సింగి
పంచాయతీ కింజేరు గ్రామం వద్ద
ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో
పీపుల్స్ సొసైటీ సౌజన్యం తో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా జరిగిన సంఘం జిల్లా
ఉపాధ్యక్షుడు టి సూర్యనారాయణ
మాట్లాడుతూ. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు మెరుగైన
వైద్యం అందించాలనే ఉద్దేశం తో ఈ శిబిరం ఎర్పాటు చేశా మన్నారు.
పంచాయతీ పరిధిలో 7గ్రామ లనుంచి సుమారు140మంది రోగులు
వైద్యం పొందారు. డాక్టర్ విజయ్
భాస్కర్.ఉచితంగా రోగులకు వైద్య
పరీక్షలు నిర్వహించి. ఇంజాక్సన్
మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబ్బంది. ఎస్ స్వామి. హెచ్ ఏ ఎం రూప. సి హెచ్ ఓ
బి ప్రసనకుమారి. ఏఎన్ఎం గిరిజన సంఘం నాయకులు. పాంగి మోహన్
దాస్. వంతల కేశవరావు. పాంగి డొంబు. కొర్ర.దాసుబాబు. కొర్ర చండల్. పోతురాజు.
తదితరులు పాల్గొన్నారు.
