Saturday, April 18, 2026
HomeUncategorizedవైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు వీరే

వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు వీరే

పలు జిల్లాల సమన్వయకర్తలుగా మాజీ మంత్రులను నియమిస్తూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, తూర్పు గోదావరి జిల్లాకు ఎమ్మెల్సీ బొత్స సత్యన్నారాయణ, పశ్చిమ గోదావరి జిల్లాకు మాజీ మంత్రి గుడివాడ అమర్ నాధ్ లను నియమించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా బుధవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments