Wednesday, April 22, 2026
HomeNewsఎంపీ సల్మాను మర్యాదపూర్వకoగా కలిసిన పేడాడ

ఎంపీ సల్మాను మర్యాదపూర్వకoగా కలిసిన పేడాడ

శ్రీకాకుళంలో ప్రముఖ సామాజిక వేత్త విశ్రాంత ప్రిన్సిపాల్ పేడాడ రాంబాబు సోమవారం బెంగళూరులో తమిళనాడు ఎంపీ రజతి సల్మాను తన కుమారుడు కిరణ్ కుమార్ తో కలిసి మర్యాదపూర్వక కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో శ్రీకాకుళం జిల్లా లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్టు రాంబాబు చెప్పారు. ఎంపీ సల్మా ప్రస్తుతం తమిళనాడు వక్ఫ్ బోర్డు నెంబర్ గా, కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా, కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిటీ కన్సల్టేటివ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవి విరమణ చేసిన తర్వాత ఉద్యోగులు సమాజ సేవలో పాల్గొనాలని దేశానికి తమ వంతు సేవలు అందించాలని సూచించారన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న రాంబాబు మాస్టారు ను ఆమె అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments