భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు
ఆదివాసీ మహిళలను ఉంపుడు గత్తెలుగానో లేదా పెళ్లి చేసుకొనో వారిని అడ్డం పెట్టుకొని ఆదివాసీ చట్టాల్ని, హక్కుల్ని ఉల్లంఘిస్తే ఊరుకొనేదిలేదని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు హెచ్చరించారు.తంటేపురెడ్డి వీర్రాజు అనే గిరిజనేతరుడు మైదాన ప్రాంతం నుండి వలస వచ్చి కొయ్యూరు మండలం మర్రివాడ పంచాయితీ దొడ్డవరం గ్రామంలో నివసిస్తూ,జి మాడగుల మండలం నిట్టపుట్ గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ సాగెని సంధ్యరాణిని చేసుకొని,గ్రామకంఠం భూమిలో ఆమె పేరుతో శాశ్వతంగా ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తే గ్రామస్తులు అడ్డుకొనగా, గిరిజన మహిళనని, ఇంటి నిర్మాణానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ ని కోరడంతో స్థానిక తహసీల్దార్ గ్రామకంఠంలో ఒక్క సెంట్ స్థలం కేటాయించి గ్రామసభ అనుమతితో రేకుల షెడ్డు నిర్మించుకోవాలని ఎండార్స్ మెంట్ ఇవ్వగా,గ్రామసభ అనుమతి లేకుండానే సెంట్ కు మించి స్థలంలో శాశ్వతంగా ఇల్లు నిర్మించడాన్ని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడంతో కొయ్యూరు తహసీల్దార్ పి. మురళీబాబు గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి ఇరువర్గాలను శాంతింపచేసారు. సాగెని సంధ్యరాణి తల్లిదండ్రుల తరుపు కుటుంబ సభ్యుల అభ్యర్ధన మేరకు కమ్యూనిటీ హాలుకు వెళ్ళే దారికి అడ్డు లేకుండా ఒక సెంట్ స్థలంలో మాత్రమే రేకుల షెడ్డు కట్టుకోవడానికి గ్రామస్తులు అంగీకరించారు.ఈ కార్యక్రమంలో మొట్టడం రాజబాబు మాట్లాడుతూ ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాన్ని కాపాడుకోవడంలో ఎవరి గ్రామాన్ని వారు కాపాడుకోవడానికి ముందుకు రావాలని అలా ముందుకు వచ్చిన దొడ్డవరం గ్రామస్తులను అభినందిస్తూ, ఆదివాసీ అమ్మాయిలు ఆదివాసీ అబ్బాయిలను పెళ్లి చేసుకొంటే ఇలాంటి ఇబ్బందిలు రావని, ఆదివాసీ మహిళలను ఉంపుడు గత్తెలుగానో లేదా పెళ్లి చేసుకొనో వారిని అడ్డం పెట్టుకొని చట్టాల్ని ఉల్లంఘిస్తే ఊరుకొనేదిలేదని హెచ్చరిస్తూ, ఆదివాసీ అమ్మాయిలు ఆదివాసేతరులకు పెళ్లి చేసుకొంటే తనకున్న హక్కులు, చట్టాలను కోల్పోవలసి వస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొలిసింగి సత్యనారాయణ,పెసా ఉపాధ్యక్షులు వెంకటరావు,ఆదివాసీ జెఏసి నాయకులు నర్సి పాపారావు, బూరుగుల వెంకట్రావు,బొబ్బిలి కామేశ్వరరావు,సాగెని కోటేశ్వరరావు, గ్రామపెద్ద మడపల నూకరాజు, ఆర్ఐ రాజన్నదొర,విఆర్వోవో జీవరత్నం, పంచాయతీ కార్యదర్శి మహేష్, దొడ్డవరంగ్రామస్తులతో పాటు చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
