Wednesday, June 3, 2026
HomePoliticsAndhra Pradeshప్రారంభమైన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

ప్రారంభమైన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అంకితభావంతో చేపట్టి పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం రామ అప్పారావు అన్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చేపట్టిన సభ్యత నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పివిఎస్ఎన్ రాజు సూచనలతో గురువారం మండలంలోని గోవాడ గ్రామంలో ప్రారంభించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు ఏడువాక నూకరాజు ,బండి గోపి లతో కలిసి ముందుగా చోడవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం మాధవితో తొలి సభ్యత్వాన్ని నమోదు చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ సభ్యత నమోదు కార్యక్రమాన్ని శక్తి వంచన లేకుండా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డైరెక్టర్ ఏడువాక శ్రీనివాసరావు పాల సంఘం డైరెక్టర్ ధర్మిశెట్టి గాలి నాయుడు స్కూల్ కమిటీ డైరెక్టర్ వేపాడ చిరంజీవి ,వేపాడ అప్పారావు, సేనాపతి అప్పలనాయుడు ఏడువాక శంకర్రావు, బేరా సన్యాసిరావు, తాసుబిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments