Thursday, June 4, 2026
HomePoliticsAndhra Pradeshఘనంగా నున్నా కృష్ణ జన్మదిన వేడుకలు

ఘనంగా నున్నా కృష్ణ జన్మదిన వేడుకలు

మహిళలకు చీరలు – విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ
రాజమహేంద్రవరం, జయజయహే ప్రతినిధి:
ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు నున్నా కృష్ణ జన్మదిన వేడుకలు రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. శానిటోరియం సంతోష్ నగర్‌లో టీడీపీ నాయకుడు గున్నూరి అశోక్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సుమారు 200 మంది మహిళలకు చీరలు, 100 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టినరోజును సేవా దృక్పథంతో జరుపుకోవడం అభినందనీయమని అభిమానులు పేర్కొన్నారు.
నాయకుడు నున్నా కృష్ణ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని, ప్రజలకు అండగా నిలవాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గున్నూరి అశోక్, వేమగిరి రాజు, కొల్లి సుబ్రహ్మణ్యం, సతీష్, పెద్దపూడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments