Thursday, June 4, 2026
HomePoliticsAndhra Pradeshమంచినీటి ఉపశమనం కల్పించిన మాజీ ఎంపీటీసీ గింజల

మంచినీటి ఉపశమనం కల్పించిన మాజీ ఎంపీటీసీ గింజల

నక్కపల్లి మండలం డి ఎల్ పురం గ్రామంలో సుమారు నాలుగు సంవత్సరముల నుండి మంచినీటి సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు పలుమార్లు అధికారులకు తెలియజేసిన ఫలితం లేదు కనీసం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా కాలనీకి సురక్షిత మంచి నీరు అంద చేయాలని కాలనీవాసులందరూ విన్నవించుకుంటున్నారు ఇందులో భాగంగానే ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు అయిన గింజల వెంకటరమణ కు కాలనీవాసులు తెలియచేసారు తక్షణమే మాజీ ఎంపీటీసీ స్పందించి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడానికి కొంతమంది దాతల సహాయంతో 2400 కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంకును ట్రాక్టర్ ఇంజన్ సహాయంతో కాలనీవాసులకు నీళ్లు అందించారు కాలనీవాసులు అందరూ మాజీ ఎంపీటీవీ కు కృతజ్ఞతలు తెలిపారు, వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి మండల జిల్లా అధికారులు స్పందించి వేసవతాపాన్ని తీర్చవలసిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో కొత్త రాజు దశరథ రాజు, బ్రాంచ్ పోస్ట్మాస్టర్ సుబ్బరాజు గింజల పెదతాల రావు ట్రాక్టర్ శ్రీనివాసరావు అయినంపూడి రామకృష్ణ రాజు లొడగల అప్పారావు గింజాల శివాజీ కొక్కుర్లపాటి వెంకట రమణ రాజు గంటుపల్లి చిన్నకాసు అప్పారావు చెల్లూరు కాసు ఓసిపల్లి లక్ష్మి తదితర కాలనీవాసులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments