Friday, June 5, 2026
HomePoliticsAndhra Pradeshచక్కని కుటుంబ కథా హాస్య చిత్రం నవాజ్‌ కేఫ్‌

చక్కని కుటుంబ కథా హాస్య చిత్రం నవాజ్‌ కేఫ్‌

– కడుపుబ్బా నవ్వించే కమెడీ విందుతో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌
విశాఖపట్నం:(జయ జయహే)
హర్షిక బ్యానర్‌పై రాధవి పప్పుడిప్పు, వెంకట్‌ల నిర్మాణంలో ప్రమోద్‌ హర్ష దర్శకత్వంలో తెరెకెక్కిన నవాబ్‌ కేఫ్‌ ప్రేక్షలకు విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రం. ఈ చిత్రం హీరోగా శివాకందుకూరి,రాజీవ్‌ కనకాల,తేజు ఆశ్వీని ప్రధాన పాత్రాలలో నటించారు. ఈ చిత్రం ఆసాంతం ప్రేక్షకులకు చక్కని పసందైన కామెడీతో యువతను ఆకట్టుకునే సన్నివేశాలలో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌మూవీగా ధియోటర్లలో దూసుకుపోతున్నది.ఈనెల 20వ తేదీన విడుదలైన ఈచిత్రం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో చిత్ర యూనిట్‌ «ధ్యాక్యూ టూర్‌లో భాగంగా విశాఖలో మంగళవారం సందడి చేశారు.దీనిలోభాగంగా మద్దిలపాలెం సిఎంఆర్‌ సెంట్రల్‌ ప్రేక్షకులతో సందడి చేశారు.
– ౖయూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌–
ఈసందర్భంగా ప్రేక్షకులతో కలిసి చిత్ర హీరో శివాకందుకూరి, హీరోయిన్‌ తేజు ఆశ్వీనిలు స్టెప్‌లు వేస్తూ ఆలరించారు. ఈసందర్భంగా ప్రేక్షకుల అడిగి ప్రశ్నలు సమాదాలు ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో చిత్ర హీరో మాట్లాడుతూ యూత్‌ అంచనాలకు తగిన సన్నివేశాలతో శతశాతం అలరిస్తుంది. ప్రతి సన్నివేశం మిమల్ని కట్టిపడేసే కమెడీతో ఆకట్టుకుంటుంది. ఇదో కలర్‌ఫుల్‌కథాంశంతో తెరెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌.
– తొలిచిత్రానికి ఆపూర్వ ఆదరణ లభించింది.
చిత్ర దర్శకుడు ప్రమోద్‌ హర్ష మాట్లాడుతూ తను తొలిసారి చిత్రదర్శకుడుగా పరిచమవుతున్న చిత్రానికి ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించడం నాలో మరింత దైర్యాన్ని నింపింది. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా తిలకించి మమల్ని ఆశీర్వాదించండి.
–లవ్‌యూ వైజాగ్‌–
హీరోయిన్‌ తేజు ఆశ్విని మాట్లాడుతూ వైజాగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. లవ్‌యూ వైజాగ్‌ అంటూ ప్లైయింగ్‌ కిసెస్‌ ఇచ్చారు. ఇక్కడ బీచ్‌ నాకు నచ్చిన ప్లేస్‌. అలాంటి వైజాగ్‌లో నేను నటించిన నవాజ్‌ కేఫ్‌ చిత్రానికి మీరందరూ చూపిస్తున్న ఆదరణకు మీకు ఫిధా అయిపోయాను.ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా ఎలాంటి నిరాశపరకుండా ప్రతి సన్నివేశానికి అద్భుతంగా తెరెకెక్కించారు. చూడండి,. చూసి మమల్ని అశీర్వాదించండి.. ప్లీజ్‌. ఈచిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రశాంత్‌ ఆర్‌ విహారి చక్కని బాణీలతోపాటు అద్భుతమైన బ్యాగ్‌రౌండ్‌ (బీజీఎం) అందించారు. కెమెరామెన్‌గా (డీవోపి)గా క్రాంతి వర్ణ చక్కని సన్నివేశాలను ఎంతో అందంగా చిత్రికరించారు.
inox థియేటర్ల లో
అభిమానులతో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ చిత్ర బృందం సందడి చేసింది. విశాఖలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments