Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshనూకాంభికా అమ్మవారికి ఏటా పట్టు వస్త్రాలు

నూకాంభికా అమ్మవారికి ఏటా పట్టు వస్త్రాలు

పద్మ శాలీ సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వరరావు ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంభికా అమ్మవారికి ఏటా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయ ఈవో అనుమతించారని ఏపీ పద్మశాలీ సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దొడ్డి ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవారికి మార్చి 3వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తమ సంఘం చేసిన విజ్ఞప్తికి ఈఓ, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, ధర్మకర్తలు ఆమోదం తెలిపారని ప్రకటించారు. ఈ మేరకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలనుకునే సంఘ సభ్యులంతా ఈ సారి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించారు. పద్మశాలీలు మాత్రమే కాకుండా చేనేత పరిశ్రమ పెద్దలు కూడా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పెద్దలు, ఆలిండియా ఖాధీబోర్డు మాజీ సభ్యులు పొన్నగంటి అప్పారావు, భీమిలి మాజీ ఛైర్‌పర్సన్‌ కొప్పల ప్రభావతి రమేష్‌, సింహాచలం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, ఏపీ పద్మశాలీ సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు పంపాన సత్యన్నారాయణ, జిల్లా అధ్యక్షులు తిప్పాన అప్పారావు, అనకాపల్లి అధ్యక్షులు డాక్టర్‌ గెడ్డం దివ్య తేజ, డాక్టర్‌ యామిని కుమారి పాల్గొన్నారని తెలిపారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేవారు పేరు, గోత్రాలు కమిటీ వారికి తెలియజేయాలని ఈశ్వరరావు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments