Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshకలెక్టరేట్ వద్ద జనతా వారధి

కలెక్టరేట్ వద్ద జనతా వారధి

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టరేట్ వద్ద జనతా వారధి ప్రోగ్రాం ఇంచార్జి గోపాల పాత్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు మఠం శాంత కుమారి గ మాట్లాడుతూ..గత వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ రథం తగలబెట్టిన దురదృష్టకర సంఘటన, అలాగే పలు ప్రాంతాల్లో హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లేని కారణంగా డి ఆర్ ఓ . అంబేద్కర్ కు వివరిస్తూ వినతిపత్రం అందజేశారు మీ ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలియజేయాలని కోరడమైనది.
హిందూ మతంపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు.
జనతా వారధి కార్యక్రమంలో వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రెవిన్యూ సమస్యలతో వచ్చిన ప్రజలకు అర్జీలు వ్రాసి, వాటిని జిల్లా కలెక్టర్ కు అందించాలని డిఆర్ఓ ను , కోరుతూ త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మఠం శాంతి కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యవతి జనతా వారధి కో-కన్వీనర్లు, కుడుముల వెంకటరమణ మరియు నదొలి ఉమామహేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments