జీవనం వ్రతం అయితే జీవితం నందనవనం అవుతుంది.
నిత్యతృప్తదాస్ స్వామి -ఇస్కాన్ ధర్మ ప్రచారకులు.
కర్నూలు జయ జయహే: జీవనాన్ని కూడా ఒక వ్రతంగా కొనసాగించినపుడే జీవితం నందనవనం అవుతుందని, వర్థమాన కాలంలో యాంత్రికమైన జీవనం వలన సమాజం రోగగ్రస్తం అవుతున్నదని ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ స్వామి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మప్రచారపరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం, మాధవనగర్ లోని శ్రీ శివరామాలయం నందు జరుగుతున్న ధార్మిక సప్తాహంలో భాగంగా నాలుగవరోజు “ద్వాదశి విశిష్టత – చాతుర్మాస్య వ్రత ప్రభావం” అనే అంశాన్ని గురించి భక్తులకు వివరించారు. ప్రవచనానికి ముందు శ్రీరంగపారాయణ బృందం బిలకంటి మురళి ఆధ్వర్యంలో హనుమాన్ ఛాలీసా, విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, అర్చకులు వేణు స్వామి, కమిటీ అధ్యక్షులు రాఘవేంద్ర కుమార్, కార్యదర్శి కోటేశ్వరరావు, కోశాధికారి రాజశేఖర్ రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
