Saturday, April 18, 2026
HomeUncategorizedమత్స్యకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత

మత్స్యకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత

  • మత్స్యకారులకు ప్రభుత్వం చేయూత.
  • నిత్యావసర సరుకులు అందజేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత.
  • మధురవాడ :జయ జయహే
    తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులను 5వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత ఆదివారం పంపిణీ చేశారు. మధురవాడ 5 వ వార్డ్ పరిధిలోని తుఫాను బాధితులకు ఈసాయం అందించారు.
    ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు వంట నూనె,కిలో చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ… తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో అధికారులు, సిబ్బంది నష్టం నివారణ చర్యల్లో ఎంతగానో శ్రమించారని ప్రశంసించారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో… టిడిపి నాయకులు వాండ్రాశి అప్పలరాజు,వార్డ్ అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, కొండపు రాజు, శ్రావణ్, సరస్వతి, అన్నపూర్ణ నూకరాజు, రవి, శ్రీను, రమణమూర్తి, నారాయణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments