Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఈనెల 26 నుంచి జనసేన పార్టీ సభ్యత నమోదు ప్రక్రియ ప్రారంభం.

ఈనెల 26 నుంచి జనసేన పార్టీ సభ్యత నమోదు ప్రక్రియ ప్రారంభం.

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
పార్టీ ఉద్యమంగా అందరూ జనసేన పార్టీకి భాగస్వామి కావాలని అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి దేశ సభ్యత్వాలు పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 26 తారీఖున నుండి ప్రారంభించడం జరుగుతుందని పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలుకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారు వారిని ఉద్యమ జనసైనికుడగా, పార్టీ నాయకులకు మధ్య సమన్వయకర్తగా పార్టీ బలోపేతానికి, పోరాటానికి మరింత బలాన్ని అందించి కొత్త రక్తాన్ని పార్టీలోకి తీసుకొచ్చి సభ్యత్వ నమోదు చేయించ వారిని “సాధక్”గా జనసేన పార్టీ ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని ఆర్థిక సాంకేతిక సేవ మేధో సహాయ సహకారాలు అందిస్తూ పార్టీకి కృషి చేయాలని అలాగ పాటుపడే వారిని “ప్రదాత”గా పిలుస్తారని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ సభ్యత నమోదు గ్రామస్థాయి మండల స్థాయి వార్డు స్థాయిలలో పనిచేసే సాధకులను ఎంపిక చేయడం జరిగిందని వీరందరూ ప్రధాన పాత్ర వహించే ఉత్సాహంగా పాల్గొని ఎక్కువ సభ్యత నమోదు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, అలాగే గతంలో సభ్యత్వ నమోదులు అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేసిన వారిని ఈ సందర్భంగా గుర్తిస్తూ వారు పార్టీలో నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారో వారు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని ప్రజల కష్టాలని గుర్తించాలని, పార్టీ ఉన్నత కోసం ఎక్కువ పనిచేయవలసిన అవసరం ఉన్నదని అప్పుడే వారు పార్టీలో సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని అలాంటి వారికి ఈ సమాజంలో, పార్టీలో మంచి గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో సభ్యత్వం తీసుకుని అనారోగ్యాలతో మరణించిన కార్యకర్తలు 20 మందికి ప్రమాద బీమా చెక్కులు కోటి రూపాయలు అలాగే 9 మందికి ఆస్పత్రి ఖర్చులకు నిమిత్తం రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు మొత్తం కోటి 2 లక్షల63 వేల రూపాయలు జనసేన బీమా అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments