Sunday, April 26, 2026
HomePoliticsAndhra Pradeshపోలవరం డీఆర్‌డీఏ పీడీగా డాక్టర్ దాసరి రత్నాకరరావు బాధ్యతల స్వీకారం

పోలవరం డీఆర్‌డీఏ పీడీగా డాక్టర్ దాసరి రత్నాకరరావు బాధ్యతల స్వీకారం

పోలవరం రంపచోడవరంజిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా దాసరి రత్నాకరరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం వెలుగు ఏపిడి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇప్పటివరకు వెలుగు ఏపిడిగా పనిచేసిన సిరిగిరి డేగలయ్య తన బాధ్యతలను రత్నాకరరావుకు అధికారికంగా అప్పగించారు.
కార్యాలయ అవసరాల దృష్ట్యా దాసరి రత్నాకరరావును పోలవరం జిల్లా డీఆర్‌డీఏ పీడీగా నియమిస్తూ సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా డీఆర్‌డీఏ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రత్నాకరరావు బదిలీపై పోలవరం (రంపచోడవరం) జిల్లాకు వచ్చారు.ఇదిలా ఉండగా, రంపచోడవరం ఐటీడీఏ వెలుగు ఏపిడిగా విధులు నిర్వర్తించిన సిరిగిరి డేగలయ్యను విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డేగలయ్య రిలీవ్ కాగా, కొత్త పీడీగా రత్నాకరరావు బాధ్యతలు చేపట్టడంతో జిల్లా డీఆర్‌డీఏలో పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి.
జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు, వెలుగు కార్యకలాపాల బలోపేతానికి కట్టుబడి పనిచేస్తానని రత్నాకరరావు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments