చైర్మన్ దొన్ను దొర.
గుజ్జెల మాణిక్యం, రత్నం దంపతులకు చెందిన జిఎంఆర్ ఫర్నిచర్ షాప్ ను తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాస్ బాబు సంయుక్తంగా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దొన్ను దొర మాట్లాడుతూ. మాణిక్యం రత్నం దంపతులు వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి చెంది పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మంచి మనసున్న మాణిక్యం లాంటి వ్యక్తులు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందితే ఖచ్చితంగా తనకు అవకాశం ఉన్నంత మేరకు పేదవారికి తన దగ్గర ఉపాధి కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాపారంగం రంగానికి సంబంధించి ఫర్నిచర్ షాప్ ప్రారంభోత్సవంలో తనను ఆహ్వానించినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు వ్యాపార రంగంలో మంచి అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పాడి చందు, టీడీపీ మండలం ప్రధాన కార్యదర్శి పాంగి రాజు, పంచాయతీ అధ్యక్షులు బోయి దామోదర్, నియోజకవర్గం ఎస్టి సెల్ అధ్యక్షులు బురిడీ కొములు నాయుడు, మాజీ ఎంపీటీసీ కిల్లో కుమార్, మాజీ ఎంపీటీసీ వంతల వెంకట్ రావు, టీడీపీ నాయకులు కిల్లో శ్యామ్, క్లస్టర్ ఇంచార్జి కొర్ర నాగరాజు, సిరిగాం పంచాయతీ అధ్యక్షులు పూజారి మాణిక్యం, కిల్లో బాబురావు, క్లస్టర్ ఇంచార్జ్ కొర్ర శేఖర్ టీడీపీ నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు.
