ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్లు,పలహారాల పంపిణీ
* మండలాలు, గ్రామాల్లో భారీ కేక్ కటింగ్ కార్యక్రమాలు
* ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
* రక్తదాన శిబిరాలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
* ఎంపీ క్యాంపు కార్యాలయంలో 100 కేజీల భారీ కేక్ కటింగ్
రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ జన్మదినోత్సవ వేడుకలు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గ మండలాల్లో కూటమి నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొని సేవా కార్యక్రమాలు చేపట్టారు.
– ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవా, రక్తదాన శిబిరాలు
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పలహారాలు పంపిణీ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా కార్యక్రమాలు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– ఎంపీ కార్యాలయంలో 100 కేజీల భారీ కేక్ కటింగ్
అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గేదెల స్వరూప్ ఆధ్వర్యంలో 100 కేజీల భారీ కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వందలాది కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.అదేవిధంగా ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అనేక మంది రక్తదానం చేశారు. యువతకు ప్రోత్సాహం కల్పిస్తూ 61 మందికి ఉచిత హెల్త్ పాలసీలు అందజేశారు.ఎంపీ కార్యాలయం నేడు సేవా కార్యక్రమాల ప్రధాన కేంద్రంగా మారింది.
– ప్రతి మండలంలో విస్తృత సేవా కార్యక్రమాలు
జిల్లాలోని దాదాపు 24 మండలాల్లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు భోజనం పంపిణీ,వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు,ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి మండల కేంద్రంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.
– ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో ఎంపీ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా నాయకులు పాల్గొని అభిషేకాలు,అర్చనలు నిర్వహించి ప్రార్థనలు చేశారు.మొత్తం రోజంతా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎంపీ డా. సి.ఎం రమేష్ జన్మదినోత్సవ వేడుకలు సేవా దృక్పథంతో నిర్వహించారు.

