Friday, June 12, 2026
HomePoliticsAndhra Pradeshకూటమి తో బీసీలకు లబ్ధి

కూటమి తో బీసీలకు లబ్ధి

బీసీలకు బడ్జెట్లో అధిక కేటాయింపులు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లకు కృతజ్ఞతలు తెలిపిన వంశీ కృష్ణ

రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టుగా భావించాలని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ అన్నారు. గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ పెట్టి కనీసం బీసీలకు తీవ్ర నిరాశ ఎదురైందన్నారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ లో మాటాడుతూ మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలకు సింహభాగం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అలాగే స్వర్ణకారులకు కార్పొరేషన్ , గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులలో 10శాతం రిజర్వేషన్ కల్పించేందుకు నాయి బ్రాహ్మణ సోదరులకు ,చేనేత కార్మికులకు విద్యుత్తులో రాయితీ కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో కొన్ని బీసీ లకు కొన్ని ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేశారని , వాటిని ప్రస్తుత గవర్నర్ ప్రభుత్వ అమలు తీరుపై అదేవిధంగా ఆదరణ పథకం సంబంధించిన అంశాలకు సంబంధించిన వివరాలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 56 బీసీ కార్పొరేటర్ కు సంబంధించిన నిధులు మంజూరు సంబంధించిన అంశాల గురించి, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా రాయితీలు, లోన్లు సంబంధించిన అంశాల గురించి, నిరుద్యోగులకు మేలు కలిగే ఎంబీసీ, ఎఫ్ బి సి కారు లోన్ సంబంధించి అంశాలు సంబంధించిన అంశలతో పాటు ,బీసీలకు రాయితీలు, లబ్ది చేకూరే అంశాలుకు సంబంధించిన వివరాలపై చర్చించారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments