పెదకోట, పినకోట, పంచాయతీలలో తహశిల్దార్ వీరభద్ర పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు . ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సచివాలయం డిజిటల్ అసిస్టెంట్, వీఆర్వో సచివాలయ సిబ్బంది,ద్వారా వెంటనే పరిష్కారానికి బాధ్యతలు తీసుకోవాలని, ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలు సమర్థంగా అందేలా, అధికారులు సమన్వయంగా పనిచేయాలని అన్నారు. డిజిటల్ అసిస్టెంట్ సిస్టంలో చేయవలసిన పనులను ఏ తప్పులు లేకుండా జాగ్రత్తగా నిర్వహిస్తూ సిస్టమ్ సక్రమంగా ఉపయోగించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సేవలను త్వరితగతిన సమర్థవంతంగా అందించే విధంగా పనులు పూర్తి చేయాలని, ప్రజలకు సంబంధించిన ఏ పని అయినా సచివాలయంలోనే పరిష్కరించాలన్నారు. పెదకోట,పినకోట రేషన్ డిపోలను పరిశీలించి లబ్ధిదారులకు రేషన్ సరైన సమయంలో అందు తుందో, లేదో స్వయంగా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ పంపిణీ విధానం విధానం పారదర్శకంగా సక్రమంగా కొనసాగుతుందని లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
పెదకోట పంచాయతీ విఆర్ఓ పై వచ్చిన ఫిర్యాదు మేరకు తాసిల్దార్ హెచ్చరిస్తూ ఇకపై ఇటువంటి ఫిర్యాదులు వచ్చిన ఎడల తనపై తగిన చర్యలు తీసుకుంటానని తాసిల్దార్ హెచ్చరించారు.
అనంతగిరి తహశీల్దార్ పర్యటన.
RELATED ARTICLES
