ఈనెల 17న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎండిఓకే అప్పారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కింతలి కేజే పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు
డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రీను తో కలిసి కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగులు సోకిన చిన్నారులు కిషోర్ బాలులు వివిధ రకాల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని చెప్పారు. రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి ముందలించడం, కడుపునొప్పి, నీరసం, ఆందోళన, విరోచనాలు, వాంతులు అవ్వడం రెండు లక్షణాలు కనిపిస్తాయన్నారు. వాటి నివారణకి ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలో కళాశాలలో అంగన్వాడి కేంద్రాల్లో ఆల్బెండజోల్ మందులు అందజేయడం జరుగుతుందని వైద్యులు చెప్పారు. కాబట్టి ఆ రోజు మీ పిల్లల్ని వారు చదువుతున్న పాఠశాలకు కళాశాలకు తీసుకెళ్లి ఉచితంగా అందించే బి వార్మింగ్ మందులను పొందాలని విజ్ఞప్తి చేశారు.
