మరో నెల రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఇష్టపడి పరీక్షలు రాయాలని తద్వారా ఉత్తమ మార్పులు సాధించి కళాశాలకు మంచి పేరు తేవాలని మాడుగుల ఎం డి ఓ కే అప్పారావు సూచించారు. శుక్రవారం మాడుగుల మండలం తాటిపర్తి ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఆయన 10వ తరగతి విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తూ ధైర్యం చెప్పారు. పరీక్షలు రాసేటప్పుడు ధైర్యంగా రాయాలని, మంచి మార్కుల తో పాస్ అవుతామన్న దృఢ సంకల్పం పట్టుదలతో ఉండాలని చెప్పారు. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక వేసుకొని చదువుకోవాలని సూచించారు. మీ తల్లిదండ్రులకు మీ పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు.
