జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పరిపాలన విభాగం, పలు విభాగాలను జీవీఎంసీ కమిషనర్ జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీలో ముందుగా పరిపాలన విభాగం లో ఉద్యోగుల పనితీరును కమిషనర్ పరిశీలించి ఉద్యోగుల విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు పొందుపరుస్తున్న ఫైళ్లను కంప్యూటర్ ద్వారా పరిశీలించారు. వారి యొక్క విధులకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డిస్పాచ్ విధానం ఎలా ఉంది, ఏ ఏ అంశాలపై డ్రాప్ నోట్లను పొందుపరుస్తున్నారు,తపాళ్ల రిజిస్టర్లో ఇన్ వార్డ్,ఔట్ వార్డు అంశాలను ఎలా నమోదు చేస్తున్నారు, నిర్ణీత కాలంలో ఫైళ్లను పొందుపరుస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలిస్తూ పలుచోట్ల అధికంగా ఉన్న ఉద్యోగులను గమనించి పనులు అధికంగా ఉన్న సీట్ల వద్దకు మార్చాలని అదనపు కమిషనర్ కు కమిషనర్ ఆదేశించారు. విధి నిర్వహణలో ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని ,అలసత్వం వహిస్తే సహించేది లేదని ఉద్యోగులకు కమిషనర్ ఆదేశించారు.
జీవీఎంసీ లో పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్.
RELATED ARTICLES
