Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు*

ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు*

తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ ఆధ్వర్యంలో పగిడ్యాల మండలం, యం. ఘణపురం గ్రామంలోని శివాలయం నందు మంగళవారం ఐదురోజుల ధార్మిక కార్యక్రమాలను తి.తి.దే. ఉమ్మడి జిల్లాల కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మంగళవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు శనివారం ఆంజనేయస్వామి దేవస్థానం నందు భజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీమద్రామాయణంపై జి. వేంకట రమణయ్య ఉపన్యసించారు. తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి, సర్పంచ్ పి.ప్రతాప్ రెడ్డి, బి.ప్రభాకర్ రెడ్డి, బి విజయభాస్కర్ రెడ్డి, కె.ఎల్లయ్య, జి.చంద్రన్న, కె.వెంకటేశ్వర్లు, జి శివన్న, కె.నాగ మల్లయ్య, బి రాంభూపాల్ రెడ్డి, కె.మల్లయ్య కె చిన్న వెంకటేశ్వర్లు, జి వెంకటస్వామి, సి.వి రాంరెడ్డి, కే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments