Wednesday, June 3, 2026
HomePoliticsAndhra Pradeshవిద్యుత్ వైర్లను తాకుతున్న చెట్ల కొమ్మలు… విద్యార్థుల భద్రతపై ఆందోళన

విద్యుత్ వైర్లను తాకుతున్న చెట్ల కొమ్మలు… విద్యార్థుల భద్రతపై ఆందోళన

కొవ్వూరు పట్టణంలోని గౌతమి నగర్ ప్రాంతంలో ఉన్న ఎంపీ యూపీ స్కూల్ వెలుపల చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా విద్యుత్ వైర్లను తాకుతున్నాయి. ముఖ్యంగా గాలి బలంగా వీచినప్పుడు, వర్షాలు కురిసే సమయంలో ఈ కొమ్మలు వైర్లను తాకడం వల్ల స్పార్కులు, మంటలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడైనా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని వారు భయపడుతున్నారు.
ఎంపీ యూపీ స్కూల్ పరిసరాల్లో రోజూ వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ వైర్లను తాకుతున్న చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
గతంలో కూడా పలుమార్లు ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వారు తెలిపారు.
కావున కొవ్వూరు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, స్కూల్ పరిసరాల్లో ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి, విద్యుత్ వైర్లను సురక్షితంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments