Monday, April 20, 2026
HomeCrimeమానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో బిడ్డను నదిలో జారవిడుచుకున్న తల్లి

మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో బిడ్డను నదిలో జారవిడుచుకున్న తల్లి

మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో తన 45 రోజుల పసిబిడ్డను ఏటిలో జారవిడుచుకున్న జారవిడుచుకున్న సంఘటనపై చోడవరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందింది. ఈ మేరకు వారు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
మునగపాక మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన బూరపు సత్యవతి కూతురు లీలాకి బంటు శివ తో వివాహం 2025 మర్చి లో వివాహం జరిగింది. వారికి గత ఏడాది డిసెంబర్ 28న బిడ్డ జన్మించింది ప్రసవం తరువాత లీల తీవ్రమైన మానసిక వేదనకు లోనై, ఒకరోజు లీల తన బిడ్డను ఇంటి వద్ద వదిలి ఊరిలో గల పెద్దకొండకు వెళ్లినట్లు, లీలను వెతికి తీసుకు వచ్చిన తరువాత లీల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చోడవరం కోట వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. లీలతో పాటు ఆమె భర్త,తల్లి, అత్త కూడా ఉంటున్నారు. అయితే ఈ నెల 7 న లీల భర్త అయిన శివ తన సొంత గ్రామానికి వెళ్లగా అదే రోజు రాత్రి సుమారు 11.20 నుండి 12.00 గంటల సమయం లో లీల కి మరల డిప్రిషన్ రావడంతో తన 42 రోజుల బిడ్డను తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. తెలిసిన వెంటనే ఈ విషయం శివ కి చెప్పగా అతను వెతికి ఆదివారం నా ఉదయం 6 గంటల సమయంలో 100 కు ఫోన్ చేయడం, అలాగే 7 గంటలకు శివకి లీల ఫోన్ చేసి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నానని చెప్పినట్లు ఫిర్యాదుల పేర్కొన్నారు. శివ అక్కడకి వెల్లి బాబు గురించి అడగగా బ్రిడ్జి దగ్గర బాబు తన చేతుల నుండి జారి నీటిలో పడిపోయాడని ఎంత వెతికిన బిడ్డ కనిపించలేదని చెప్పినట్లు ఫిర్యాదుల పేర్కొన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు గోవాడ ఏటిలో జల్లులు పడుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా బాబు ఆచూకీ దొరకలేదు.దీంతో చోడవరం సిఐ పి అప్పల్రాజు ఆదేశాల మేరకు ఎస్సై బి జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments