Monday, April 20, 2026
HomeDevotionalదేశ నాయకులను మరువని కేజీపురం

దేశ నాయకులను మరువని కేజీపురం

ఉత్సాహంగా నెహ్రూ తీర్థం మాడుగుల మండలం కస్పాజగన్నాధపురం గ్రామానికి ఒక విశిష్టత నెలకొంది. ఎక్కడైనా దేవీ దేవతల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ ఈ గ్రామంలో వాటితోపాటు దేశ నాయకులు ఉత్సవాలు కూడా ప్రతి ఆడది క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటారు. స్వర్గీయ గ్రామ తొలి సర్పంచ్ పాలకుర్తి ఆదినారాయణ(మైనర్) ప్రోత్సాహంతో ఈ దేశ నాయకులు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయన టైములోనే గ్రామంలో గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ దేశ విగ్రహాలను ఏర్పాటు చేసి వారి వారి జయంతి కానీ, మరో రోజు గానీ వారి తీర్థ మహోత్సవాలు నిర్వహిస్తారు. వి కూడా అంగరంగ వైభవంగానే చేస్తారు. ఇటీవల జనవరి 31న మహాత్మా గాంధీ తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించిన తేజపురం గ్రామస్తులు తాజాగా ఆదివారం పండిట్ జవహర్లాల్ నెహ్రూ తీర్థ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఊరికే బోస్ వంటి నాయకులు తీర్థాలు కూడా చేపట్టారు. సందర్భంగా గ్రామ పెద్దలు నెహ్రూ విగ్రహానికి ఓలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 8 న ఇక్కడ ఈ నేతను స్మరించుకుంటూ ప్రత్యేక తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.దీనిలో భాగంగా స్థానిక మదర్ థెరిస్సా టాలెంట్ యూత్ ఆధ్వర్యంలో యువజనులు , విద్యార్థులు ఆ మహానేత కు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.భావిభారతానికి వారు చేసిన సేవలను కొనియాడారు.ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని పిల్లల కు సాయంత్రం వివిధ పోటీలను నిర్వహించారు.స్థానిక ప్రతినిధులు రాపేటి గోవింద,కాళ్ల అప్పలనాయుడు,కాళ్ల అమ్మ తల్లి నాయుడు,ఆడారి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments