Sunday, April 19, 2026
HomeNewsఫ్లోరోసిస్ రహిత సమాజం మనందరి లక్ష్యం

ఫ్లోరోసిస్ రహిత సమాజం మనందరి లక్ష్యం

ఫ్లోరోసిస్ నివారణ, నియంత్రణ లక్ష్యంగా మనమంతా బాధ్యత వహించాలని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించగలమని జిల్లా డిఎంహెచ్ఓ లేబ్ టెక్నీషియన్ ఎం.మోనిక అన్నారు. పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో జరిగిన జాతీయ ఫ్లోరోసిస్ నివారణ, నియంత్రణ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ వ్యాధి సోకినచో నోటిలో దంతములు పసుపు, గోధుమ, నలుపు రంగులలో మారతాయని అన్నారు. రెండు చేతులనూ తల వెనుకకు తెచ్చుకోలేకపోతే ఈ వ్యాధి సోకినట్లే అంటూ వ్యాధి లక్షణాలను వివరించారు. తొలుత మోనిక బాలబాలికల దంతాలన్నీ ఒక్కొక్కరి వద్దకూ వెళ్లి పరిశీలించారు. త్రాగునీటిలో అనుమతించదగు ఫ్లోరైడ్ పరిమితి గూర్చి వివరించారు. పౌష్టికాహార చర్యగా ఏయే ఆహార పదార్థాలు సేవించాలో అవగాహన పర్చారు. పాలు పెరుగు జున్ను అనేవి కాల్షియం పదార్థాలని, ఉసిరి జామ నిమ్మ నారింజ బెల్లం పచ్చటిఆకుపదార్ధాలు జీలకర్ర మునగకాడలనేవి విటమిన్ సి అని, పచ్చధాన్యాలు చిరుధాన్యాలు వెజిటబుల్ ఆయిల్ ఆకుకూరలనేవి విటమిన్ సి అని, వెల్లుల్లి ఉల్లి అల్లం క్యారెట్ బొప్పాయి చిలగడదుంపలనేవి జీవక్రియ రక్షకములని మోనిక విశదీకరించారు. శరీరంలోని మృదువైన కండరాలు, లిగమెంట్స్, కణజాలాలు, ఎర్రరక్తకణాలు, ఉదరభాగంలోని జీర్ణవ్యవస్థలపై ఈ అస్తిరహిత ఫ్లోరోసిస్ ప్రభావం చూపుతుందని కాబట్టి పైన తెలిపిన పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె హెచ్చరించారు. సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ ఫ్లోరోసిస్ కంట్రోల్ విభాగం ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ నిర్దేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎన్.సి.డి.విభాగం ఆధ్వర్యంలో ఎన్.పి.పి.సి.ఎ.ఎఫ్. లేబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న ఎం.మోనిక విద్యార్థులకు ఎన్నో ఆరోగ్య సూత్రాలు వివరించారని కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. వాటిని అమలుచేస్తూ ఆహ్లాదకరమైన జీవితం పొందాలని అన్నారు. ధూమపానం మద్యపానం డ్రగ్స్ గంజాయి ఖైనా కొకైన్ వంటి మత్తు పదార్థాలను దరి రానీయకుండా ఉంటే ఆరోగ్యంతో పాటు శారీరక మానసిక వికాసం పొందవచ్చునని తిరుమలరావు పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎల్.టి. ఎం.మోనిక, స్థానిక ఆశ కార్యకర్త ఎ.కుమారిలతో పాటు ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యెందువ వెంకటరమణ, ముల్లు సుజాత, ఎం.పెంటయ్య, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొని, ప్రసంగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments