Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshమరోసారి మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్

మరోసారి మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్

వీఎంఆర్డీఏకు వినతుల, ఫిర్యాదుల పరిశీలన చేయాలి కైలాసగిరి నుంచి టూరిజం సర్క్యూట్ వేలంపేట వాసులకు 177 ఇళ్లు నిర్మాణం మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటన వీఎంఆర్డీఏ, జీవీఎంసీపై కీలక సమీక్ష విశాఖ‌ప‌ట్నం పూర్ణా మార్కెట్ స‌మీపంలో ఉన్న వెలంపేట మురికివాడ బాధితుల‌కు ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది…ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశాల‌తో పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ ఇటీవ‌లే ఈ మురికివాడ‌లో ప‌ర్య‌టించి అక్క‌డ నివ‌సిస్తున్న వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు…తాము ఇళ్లు లేక అనేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని…త‌మ‌కు ఇళ్లు క‌ట్టించాల‌ని వారు కోరారు…దీంతో వెలంపేట‌లో నివ‌సిస్తున్న 177 కుటుంబాల‌కు ఇళ్ల నిర్మాణానికి మంత్రి నారాయ‌ణ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు..అయితే ఇళ్ల నిర్మాణంలో ఆర్ధిక‌ప‌ర‌మైన అంశాల్లో ఎలా ముందుకు వెళ్లాల‌నే దానిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోనున్నారు..అమ‌రావ‌తిలోని మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్,విశాఖ‌ప‌ట్నం మెట్రో రీజియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అధికారుల‌తో మంత్రి నారాయ‌ణ స‌మీక్ష చేసారు..ఈ స‌మీక్ష‌కు జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్,వీఎంఆర్డీఏ క‌మిష‌న‌ర్ తేజ్ భ‌ర‌త్,టౌన్ ప్లానింగ్ డైరెక్ట‌ర్ విద్యుల్ల‌త‌,ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు. వీఎంఆర్డీఏ మాస్ట‌ర్ ప్లాన్ నోటిఫికేష‌న్ ఇప్ప‌టికే విడుద‌ల చేసి ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు,సూచ‌న‌లు తీసుకున్నారు..పెద్ద ఎత్తున వ‌చ్చిన సూచ‌న‌ల‌తో మ‌రోసారి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు..మాస్ట‌ర్ ప్లాన్ లో మొత్తం 15 రోడ్లు నిర్మించాల్సి ఉండ‌గా…మొద‌టి ద‌శ‌లో 7 రోడ్ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌ను ఆదేశించారు…విశాఖ‌ప‌ట్నంలో కైలాస‌గిరి,కంభాల‌కొండ‌,జూపార్క్ ల‌ను క‌లిపి టూరిజం స‌ర్కూట్ గా అభివృద్ది చేయ‌డంపై చ‌ర్చించారు…టూరిజం శాఖ అధికారుల‌తో క‌లిసి ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ది చేయ‌డంపై దృష్టి సారించాల‌ని మంత్రి నారాయ‌ణ వీఎంఆర్డీఏ క‌మిష‌న‌ర్ కు సూచించారు…వీఎంఆర్డీఏ ప‌రిధిలో అక్ర‌మ భ‌వ‌నాలు,లే అవుట్ల ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకునేలా ప్ర‌జ‌ల్లో అవగాహ‌న క‌ల్పించాల‌ని మంత్రి సూచించారు…అలాగే పీపీపీ విధానంలో చేప‌ట్టే ప్రాజెక్ట్ ల‌పైనా మంత్రి చ‌ర్చించారు…వీఎంఆర్డీఏ,జీవీఎంసీ అధికారులు స‌మ‌న్వ‌యంతో అభివృద్ది ప‌నులను ముందుకు తీసుకెళ్లాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌కు సూచించారు. మ‌రోవైపు విశాఖ పూర్ణామార్కెట్ స‌మీపంలోని వెలంపేట మురికివాడలో నివ‌సిస్తున్న‌ 177 మందికి ఇళ్లు నిర్మించేందుకు మంత్రి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు…ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ను జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్ మంత్రికి వివ‌రించారు…విశాఖ‌ప‌ట్నం స‌మ‌గ్ర నీటి ర‌క్ష‌ణ ప్ర‌ణాళిక‌పై కూడా ఈ స‌మావేశంలో మంత్రి నారాయ‌ణ అధికారుల‌తో చ‌ర్చించారు..విశాఖ‌ప‌ట్నం చుట్టుప‌క్క‌ల ప‌రిశ్ర‌మ‌ల‌కు నీటి స‌ర‌ఫ‌రాకు ఇప్ప‌టికే డీపీఆర్ లు సిద్దం చేసిన‌ట్లు అధికారులు మంత్రికి వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సౌక‌ర్యాలు అందించ‌డంతో పాటు ఆర్ధికంగా కూడా బ‌లోపేతం కావ‌డంపై జీవీఎంసీ,వీఎంఆర్డీఏ దృష్టి పెట్టాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌కు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments