శ బీఆర్ఎస్ నేతల పిలుపు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో వేములవాడ విలీన గ్రామాల్లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. శాత్రాజ్ పల్లి 2వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఏనుగు జ్యోతి సోమవారం ఉదయాన్నే తన ప్రచారాన్ని హోరెత్తించారు. పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిసె సదానందం మాట్లాడుతూ.. ఏనుగు మనోహర్ రెడ్డి కుటుంబం గత కాలంగా గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. వార్డు సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా విద్యావంతురాలు, సేవా దృక్పథం ఉన్న ఏనుగు జ్యోతిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు తిరుపతి రెడ్డి, గుడిసె తిరుపతి గుడిసె అనిల్ గుడిసె దాసు గుడిసె హరీష్ పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొని జ్యోతికి సంఘీభావం తెలిపారు. వార్డులో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధికి పట్టం కట్టండి.. ఏనుగు జ్యోతిని గెలిపించండి
RELATED ARTICLES
