Thursday, May 7, 2026
HomePoliticsAndhra Pradeshగృహ హింసపై అవగాహన సదస్సు

గృహ హింసపై అవగాహన సదస్సు

ప్రధానమంత్రి ఉషా –జీఐఈఐ పథకం నిధులతో, “గృహ హింసను అవగాహన చేసుకోవడం మరియు పరిష్కరించడం” అనే అంశంపై శుక్రవారం మరిపాలెం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ వర్క్‌షాప్‌కు పాడేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. చిట్టి అబ్బాయి అధ్యక్షత వహించారు. కార్యక్రమ కన్వీనర్‌గా , మరిపాలెం ప్రిన్సిపాల్ డా. కె. సుధ వ్యవహరించారు. ఈ సందర్భంగా డా. కె. సుధ మాట్లాడుతూ, సమాజంలో గృహ హింసను అర్థం చేసుకోవడం, దాన్ని ఎదుర్కోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. గృహ హింసను ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమిటి, స్వీయ నియంత్రణ మరియు చట్టపరమైన అవగాహన ఎలా ఉపయోగపడుతాయో విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా సింధురి (కార్పొరేట్ ట్రైనర్ – కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్) పాల్గొని, గృహ హింసకు సంబంధించిన అంశాలను వివిధ కార్యకలాపాలు, ఉదాహరణలు, హృదయాన్ని తాకే కథల ద్వారా సులభంగా వివరించారు. విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచేలా ప్రేరణాత్మకంగా మాట్లాడారు.
ఈ వర్క్‌షాప్‌కు కోఆర్డినేటర్‌లుగా ఆంగ్ల విభాగ అధ్యాపకురాలు డా. జి. మేరీ పుష్ప మరియు చరిత్ర విభాగ అధ్యాపకురాలు భువనేశ్వరి దేవి వ్యవహరించారు.
ఈ వర్క్‌షాప్‌ను క్రిస్టల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, గృహ హింసపై అవగాహన పెంచుకొని, తమను తాము రక్షించుకునే మార్గాలను తెలుసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments