ముఖ్య అతిథిగా ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవన సమావేశ మందిరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో భవిష్య భారతం పై – దృష్టి. దిశ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న సంస్థ ఆర్ ఎస్ ఎస్ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులకు సంఘ్ అంటే ఏమిటి, గత వందేళ్లలో భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా సంఘ్ స్వయం సేవకులు చేసిన అనేక సేవా కార్యక్రమాలను వివరించారు. అదే విధంగా రాబోయే పాతికేళ్లలో చేయబోయే కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేసారు. సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యతను గుర్తు చేసారు. కార్యక్రమంలో గాజువాకకు చెందిన మీడియా మరియు సోషల్ సర్వీస్ విభాగంలో డా.కరణంరెడ్డి నరసింగరావు (కేఎన్ఆర్) ధార్మిక సంస్థ రంగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,ప్రవచన కర్త బాస్కరబట్ల ప్రసాద్ శర్మ ,మాజీ సైనిక అధికారి కార్గిల్ యుద్ధ వీరులు మరియు మానస యోగా సంస్థ గురు జి.సత్యనారాయణ ,సామాజిక కార్యకర్త సాప్ట్ వేరు ప్యాకల్టీ మద్ది కృష్ణారెడ్డి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో భవిష్య భారతం – దృష్టి-దిశ సమావేశం
RELATED ARTICLES
