టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు గీతం విద్యాసంస్థ ఆదీనంలో ఉండే ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై వైసిపీ ఎందుకు రాజకీయాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు.
భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. కొన్ని వేలమందికి అదునాతనమైన విద్యను అందిస్తూ దేశ, విదేశాల్లో ఉన్నతమైన స్థాయిలో స్థిరపడుటకు కావలసిన ఎడ్యుకేషనల్ స్కిల్స్ ను అందించే గీతం విద్యా సంస్థపై కొంతమంది పనిగట్టుకొని విషప్రయోగం చేస్తున్నారని దుయ్యభట్టారు. గీతం విద్యాసంస్థకు మధ్యలో పీనుగులాగా ఉండే భూమిని ఆసంస్థ ఉపయోగించడం వలన వైసిపీకి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. అవి ప్రజోపయోగానికి ఉపయోగపడవని అన్నారు. ఆస్థలం విద్యాసంస్థకు మధ్యలో ఉండటం వలన క్రమబద్దీకరణ చేసినట్లుయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.
