Tuesday, April 21, 2026
HomeNewsసురక్షిత ప్రయాణం అందరి బాధ్యత

సురక్షిత ప్రయాణం అందరి బాధ్యత

సురక్షిత ప్రయాణమే కుటుంబ సంతోషానికి మార్గం, అవగాహనతో ప్రమాదాలు తగ్గుముఖం, సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. కౌలుట్లయ్య, ‘హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్’లో రోడ్డు భద్రతపై అవగాహన ,ప్రమాద రహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరం పాటుపడదామని సింగనమల సిఐ జి. కౌలుట్లయ్య సూచించారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం లోలూరు క్రాస్ వద్ద టయోటా షోరూం ఎదురుగా ఉన్న ప్రముఖ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయిన ‘హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్’లో గురువారం ‘రోడ్డు భద్రత.. మా భాద్యత’ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సింగనమల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. కౌలుట్లయ్య ‘హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి’ సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ కౌలుట్లయ్య మాట్లాడుతూ అవగాహన, అప్రమత్తతతో ప్రతి ఒక్కరూ ప్రయాణాలు సాగిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అన్నారు. ప్రతి రోజు స్కూల్‌కు వచ్చే వారు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సిఐ కౌలుట్లయ్య సూచించారు. రెండు చక్రాల వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారు సీటుబెల్ట్ ధరించాలి కోరారు. అధిక వేగం మానుకోవాలని పేర్కొన్నారు. స్పీడ్ బ్రేకర్లు, మలుపులు, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు. మన ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయని, మనం సురక్షితంగా ఉంటేనే మన కుటుంబం సంతోషంగా ఉంటుందని సిఐ కౌలుట్లయ్య సందేశం ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలి ఈ సందర్భంగా సిఐ తెలిపాడు. ఈ సందేశాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ‘హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్’ యాజమాన్యం ఇలాంటి మంచి కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని ‘హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్’ యాజమాన్యం ప్రత్యేక చొరవతో నిర్వర్తిస్తున్న సామాజిక బాధ్యతను కొనియాడారు. స్కూల్ పిల్లల నుంచి తల్లిదండ్రుల వరకు అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఈ సందర్భంగా సి.ఐ కౌలుట్లయ్య సూచించారు.
హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
జి.ఎం రామ సుబ్బారెడ్డి,
సి.ఏ.ఓ ప్రతాప్ రెడ్డి,
ఏ.జి.ఎం. శంకర్ నారాయణ,
ప్రిన్సిపాల్ ఉమా, పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments