రాజమహేంద్రవరం పరిసరాల్లో గోదావరి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. ఓపెన్ రీచ్‌లకు మాత్రమే పరిమితమవ్వాల్సిన తవ్వకాలు, నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న దాదాపు అన్ని ర్యాంపులకూ విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలెక్టర్ శిక్షణ కోసం వెళ్ళడంతో ఇదే అదునుగా ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోంది. రాత్రి పగలు తేడా లేకుండా బోట్లు, లారీలు నదిలోకి దిగి ఇసుకను తోడేస్తున్నాయి. బిల్లులు లేకుండానే రవాణా జరుగుతుండటంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండి పడుతోంది. ఒక్క బిల్లుపై రూ.350 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, జిల్లాలో రోజూ రూ.10 లక్షలకుపైగా నష్టం జరుగుతోందన్న అంచనాలు ఉన్నాయి. గతంలో సీసీ కెమెరాలు, వే-బ్రిడ్జిలు, రెవెన్యూ–పోలీసు పర్యవేక్షణ ఉండగా, ప్రస్తుతం అవన్నీ నిర్వీర్యమయ్యాయి. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించకపోతే గోదావరి నదీ తీరమే ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.
గోదావరిలో యథేచ్ఛ తవ్వకాలు, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం
RELATED ARTICLES
