Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshపూల ప్రదర్శన... అదిరిపోవాలి...!

పూల ప్రదర్శన… అదిరిపోవాలి…!

విశాఖ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఫ్లవర్ షో ఏర్పాట్లను పరిశీలించిన వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ విశాఖ ఉత్సవాల్లో భాగంగా సెంట్రల్ పార్క్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఫ్లవర్ షో ఏర్పాట్లను వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ మంగళవారం పరిశీలించారు. వి ఎం ఆర్ డి ఏ జాయింట్ కమిషనర్ కే. రమేష్, చీఫ్ ఇంజనీర్ వినయ్ కుమార్, సీఏవో హరి ప్రసాద్, ఇంచార్జి డి ఎఫ్ ఓ వరుణ్ కార్తీక్ తదితర అధికారులు ఆయన వెంట వున్నారు. ఫ్లవర్ షో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాల్లో ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఫ్లవర్ షోను పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించే అవకాశం ఉన్నందున, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. బెంగళూరు, కలకత్తా సహా ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా రప్పించిన వివిధ రకాల అరుదైన పుష్పాలు, ఆకర్షణీయమైన పుష్ప అలంకరణలు, థీమ్ ఆధారిత ఫ్లవర్ డిజైన్లను పరిశీలించారు. ఫ్లవర్ షోకు “స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” థీమ్‌ను తీసుకొని, పర్యావరణ పరిరక్షణ, శుభ్రత, హరిత అభివృద్ధి అనే సందేశం ప్రజల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఫ్లవర్ షో విశాఖ నగరానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చేలా ఉండాలని అన్నారు.
విశాఖ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఫ్లవర్ షో ప్రజలకు మంచి అనుభూతిని అందించడమే కాకుండా, పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండాలని చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ స్పష్టం చేశారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments