Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshఆర్థిక అసమానతల భారత్ పై చర్చా గోష్టి

ఆర్థిక అసమానతల భారత్ పై చర్చా గోష్టి

జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీ ఉదయం 10:30 గంటలకు గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఆర్థిక అసమానతల భారత్ పై చర్చా గోష్టి నిర్వహిస్తున్నట్లు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ జి ఎస్ ఆర్ కె ఆర్ విజయ్ కుమార్ ప్రధాన వక్తగా భారత్ లో హార్దిక అసమానతల పై ప్రసంగిస్తారని తెలిపారు. ప్రపంచ అసమానతల ప్రయోగశాల 2026 నివేదిక ప్రకారం భారతదేశంలో కేవలం ఒక్క శాతం అత్యుత్తమ ధనవంతుల వద్ద 40 శాతం సంపద కేంద్రీకృతమైందని, అగ్రభాగాన ఉన్న 10 శాతం ప్రజల వద్ద దేశ జాతీయ ఆదాయంలో 58 శాతం పొందుతున్నారని అట్టడుగున ఉన్న 50 శాతం ప్రజల చేతుల్లో15 శాతం జాతీయo మాత్రమే కలిగి ఉన్నారని తెలిపారు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ తన ప్రసంగంలో ఆర్దిక అసమానతలతో పాటు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, అసమానతల పై అవగాహన పొందటానికి పౌర సంస్థల నేతలు, ప్రజా సంఘాల బాద్యులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని చర్చా గోష్టిని జయప్రదం చేయవలసిందిగా జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments