Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshకల్తీ క్రెడిట్' జగన్ రెడ్డి సొంతం

కల్తీ క్రెడిట్’ జగన్ రెడ్డి సొంతం

మిన్నల్ రవి,డా.యం.ఉమేష్ రావు
తల్లిని గెంటేసిన, చెల్లిని తరిమేసిన, బాబాయ్‌కి గొడ్డలి వేట్లు వేయించిన,పిల్లలు తాగే పాలు నుండి దేవుళ్ళకు నివేదించే ప్రసాదాల వరకు అన్నింటినీ కల్తీ చేయించిన వైసిపి అధినేత జగన్ రెడ్డికి కల్తీ క్రెడిట్ దక్కిందని వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు ఆరోపించారు.
2019-24 మధ్యకాలంలో తిరుమల శ్రీవారి భక్తులు మహాప్రసాదంగా భావించే లడ్డూల్లో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కలిపి మహా పాపానికి పాల్పడిన జగన్ రెడ్డి మరియు అతని బృందం చేసిన నేరాన్ని సుప్రీంకోర్టు వేసిన సిట్ దర్యాప్తు చేసి 600 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసిందని పేర్కొన్నారు.
పరమ పవిత్రంగా భావించే వెంకన్న ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి పడేసిన జగన్ రెడ్డి ‘కల్తీ క్రెడిట్‌’ సొంతం చేసుకున్నాడని, ఇలాంటి నీచమైన క్రెడిట్‌ని చోరీ చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు.
కల్తీ నెయ్యి కేసులో ఆనాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో బయటికి వచ్చిందని, దీనిలో జగన్ రెడ్డి ప్రమేయం ఉన్నదనే దానికి నిదర్శనం ఏం కావాలి అని ప్రశ్నించారు. అంతేకాకుండా… చార్జిషీట్లో పేర్కొన్న నిందితుల్లో ఏ-31 కె. హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి జగన్ హయాంలో గోశాల ఇన్చార్జిగా పనిచేశాడని, ఇతడు టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి దగ్గరి బంధువని,అంతిమంగా వీరివురూ కూడా జగన్ రెడ్డికి అత్యంత దగ్గరి బంధువులే అని గుర్తు చేశారు.
శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూని.. పాలే లేని కల్తీ నెయ్యితో, రసాయనాలతో కల్తీ చేసిన జగన్ & కో ఆ పాపకార్యం ద్వారా రూ.250 కోట్లను దోచుకున్నదని, ఇది సాధారణ ప్రజలో లేక రాజకీయంగా చేసిన విమర్శ కాదని.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేసి నిగ్గు తెలిచిన నిజం అని గుర్తు చేశారు.
ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగ వ్యవస్థలను గాడి తప్పించి, అన్నింటినీ కల్తీ చేసిన క్రెడిట్ దక్కించుకున్న ‘కల్తీ క్రెడిట్’ శిఖామణి జగన్ రెడ్డి మరియు అతని బృందం యొక్క అరాచకాలకు తగిన శిక్షలు విధించే బాధ్యతను సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి,తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి,తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు బాలసుబ్రహ్మణ్యం(మణి), గాజుల భగత్,గంగనపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments