Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshకెనడా దేశంలో అబ్బురపరిచిన తెలుగు సాంప్రదాయం

కెనడా దేశంలో అబ్బురపరిచిన తెలుగు సాంప్రదాయం

కెనడాలోని ఓషావా నగరంలో తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ‘సంక్రాంతి సంబరాలు విత్ సుమంగళి’ కార్యక్రమం ఘనంగా జరిగింది.డర్హామ్ తెలుగు అసోసియేషన్, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ జి టి ఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఈస్ట్ డేల్ కాలేజియేట్ అండ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించారు.డర్హామ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు స్వాతి మిరియాల, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ జి టి ఏ అధ్యక్షుడు సౌరభ్ బేడీల నాయకత్వంలో కార్యక్రమం విజయవంతంగా సాగింది.ఉపాధ్యక్షులు జనార్దన్ నలమ్, శివేంద్ర చౌబే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమి యెర్రమ్ సెట్టి, ఖజానాదారు భానుప్రియ పిల్లలమర్రి, ప్రధాన కార్యదర్శి భార్గవి సెట్టలూరి, సాంస్కృతిక కార్యదర్శి ప్రేరణ దత్తాత్రేయ, సాంస్కృతిక సమన్వయకర్త ప్రియ వడ్డేలతో పాటు సాహితి మిరియాల, సిరి బిందు, రంజిత, శిలు, క్రాంతి, సుష్మిత తదితర ఉపకమిటీ సభ్యుల కృషి వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చింది.భోగి పళ్ళు, ముగ్గుల పోటీలు, పిల్లలు–పెద్దలు పాల్గొన్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించాయి.మధురం,పక్కా లోకల్,నవరస అందించిన భోజనాలు, పానీయాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.ఈ వేడుకలకు 800 మందికి పైగా తెలుగు ప్రేక్షకులు హాజరై, డర్హామ్,జి టీ ఏ ప్రాంతాల తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విట్బీ ఎంపీ ర్యాన్ టర్న్‌బుల్, డర్హామ్ పోలీస్ చీఫ్ పీటర్ మోరైరా, డిప్యూటీ చీఫ్ క్రిస్ కిర్క్ పాట్రిక్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.సంక్రాంతి సంబరాలకు ప్రాణం పోసిన సుమంగళి లైవ్ కాన్సర్ట్,ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ గాయని సుమంగళి లైవ్ కాన్సర్ట్. ఆమె వేదికపై అడుగుపెట్టగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. సంప్రదాయ గీతాల నుంచి ప్రజాదరణ పొందిన సినీ గీతాల వరకు ఆమె ఆలపించిన ప్రతి పాట ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. హృద్యమైన గానం, శక్తివంతమైన స్వరం, ప్రేక్షకులతో ఏర్పరచుకున్న అనుబంధం వేడుకను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి.భారతదేశానికి దూరంగా ఉన్నప్పటికీ సంక్రాంతిని ఒక కుటుంబంలా జరుపుకోవడం, సమాజ ఐక్యతను పెంపొందించడం, చిన్న వ్యాపారాలకు వేదిక కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. సంగీతం, సంప్రదాయం, సమాజ సేవ కలగలిసిన ఈ సంక్రాంతి సంబరాలు సంపూర్ణ విజయంతో ముగిశాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments