స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద గల శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం కి శుక్రవారం స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ సందర్శించడం జరిగింది వీరికి ఆలయ పాలకవర్గ సభ్యులు మరియు దేవస్థానం సిబ్బంది అర్చకులు వేద మంత్రచరణాల మధ్య మేళతాళాలతో స్వాగతం పలకడం జరిగింది. దేవాలయ అర్చకులు వారి గోత్రం నామాలతో పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఈనెల 25వ తేదీ జరుగు రథసప్తమి వేడుకల్లో భాగంగా దేవాలయ ప్రాంగణంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అన్ని ఆయన పరిశీలించడం జరిగింది. వచ్చే భక్తులకు త్రాగునీరు ప్రసాదం ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని ఆయన కమిటీ పాలకవర్గ సభ్యులకు దేవస్థాన సిబ్బందికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొడ్డేడ మురళి, ధర్మకర్త మండలి సభ్యులు సూరిశెట్టి బాలమ్మ, తురకలపూడి ఈశ్వరరావు, రేపాక వరలక్ష్మి, ఈశ్వరరావు, మారిశెట్టి అరుణ భాస్కరరావు, తిమ్మరాజు మల్లికార్జున రావు, దొడ్డి భరత్, కర్రి లక్ష్మి నూకరాజు, కై చర్ల నరసమ్మ జనసేన పార్టీ నాయకులు బుద్ధ శ్రీనివాసరావు సూరిశెట్టి రాముడు బుద్ధ రాజేష్ పీలాహరి తదితరులు పాల్గొన్నారు
రథసప్తమి మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
RELATED ARTICLES
