నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం క్లబ్ అధ్యక్షులు సి హెచ్ రమణ అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడకమైదానంలో నిర్వహించారు. ముందుగా నేతాజీ చిత్రపటానికి డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు, డాక్టర్ డి.వి.జి. శంకరరావు, క్లబ్ వ్యవస్థాప గౌరవ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అతిధిలుగా హాజరైన ఎ. తిరుపతి రావు, డాక్టర్ డి.వి.జి. శంకరరావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకరమైన ఇండియన్ సివిల్ సర్వీసును తృణప్రాయంగా వదిలి భరతమాత ద్రాస్యశృంఖాలను విడిపించుటకై స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గున్న దేశభక్తుడు నేతాజీ అని, జయంతి కలిగి, వర్ధంతి లేని మహనీయులు సుభాష్ చంద్రబోస్ అని ఆయన ధైర్యసాహసాలను అభివర్ణించారు. అటువంటి మహనీయులు నేతాజీని ప్రతీ భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈకార్యక్రమంలో జాలీ వాకర్ వై. నలమహారాజు, క్లబ్ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు పి. అప్పలరాజు, జాయింట్ సెక్రటరీ ఐ. అప్పలరాజు,యోగ గురువు, మేధావి ఎస్. చక్రధర్ పట్నాయక్, క్లబ్ పెద్దలు తాడ్డి ఆదినారాయణ, కోట్ల సత్యనారాయణ,శ్రీనివాస్ రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
విప్లవ తేజం “నేతాజీ సుభాష్ చంద్రబోస్”
RELATED ARTICLES
