కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీ వి వి ఎస్ కమలాకర్ పుట్టినరోజు సందర్బంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ సి డబ్ల్యూ సి సభ్యులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు కమలాకర్ కి పు
ట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కమలాకర్ మాట్లాడుతూ ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ కుటుంబసభ్యుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ అభిమానం నాకు మరింత స్ఫూర్తిని ఇచ్చిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో కీలకపాత్ర పోషిస్తానని ఆయన అన్నారు.కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు,డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు,విజయనగరం, శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాండవ గాయత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్, కార్యదర్శి ఆనంద్,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి, భీమిలి ఇంచార్జ్ రామకృష్ణ,దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ, సీనియర్ నాయకులు గుత్తుల శ్రీనివాస్, వజపర్తి శ్రీనివాస్, సోడాదశి సుధాకర్,జర్రిపోతుల ముత్యాలనాయుడు, ఉమ్మిడి భాస్కర్,గవర వెంకటరమణ, కస్తూరి వెంకటరావు,ఫర్వీన్ ఖాన్, రజియా బేగం,పడాల రమణ, రామదాసు,భోగవరపు శ్రీనివాస్, గుర్రం కనకారావు తదితరులు పాల్గొన్నారు.పాపా హోమ్ లో పుట్టినరోజు వేడుకలు..!కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ అధ్యక్షులు కమలాకర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం విశాఖ లోని పాపా హోమ్ లో జరిగాయి. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అనాధ బాలలు మధ్య ఈ వేడుకలు నిర్వహించారు. పిల్లలు అంతా హాజరై కమలాకర్ అంకుల్ కి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థనలు చేశారు. పిల్లలందరికి పసందయినా భోజనం వడ్డించారు. పిల్లలు అంతా కమలాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళ తో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఏటా తాను పాపా హోమ్ లో పాల్గొంటున్నట్టు తెలిపారు.
ఘనంగా ‘కాంగ్రెస్ కమలాకర్’ పుట్టినరోజు వేడుకలు
RELATED ARTICLES
