సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులకు మంత్రుల ఆదేశం ,5 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా,కడపలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఇస్తేమా నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవితమ్మ, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.కొప్పర్తి పారిశ్రామికవాడ సమీపంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జాతీయ స్థాయి తబ్లిగి జమాతే ఇస్తేమా నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను మంత్రులు ఆదేశించారు. మంగళవారం మంత్రుల బృందంతో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ బీటెక్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ , జిల్లా ఎస్పీ నచికేత్,వివిధ శాఖల అధికారులతో కలసి ఇస్తేమా నిర్వహణ తుది ఏర్పాట్లపై సమీక్ష చేశారు.ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు తరలివస్తున్నారు. దాదాపు 5 లక్షల పైగా ముస్లింలు ఇస్తేమాకు హాజరవుతారని పేర్కొన్న మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.లక్షలాదిగా తరలివస్తున్న వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని, సమన్వయంతో అన్ని ప్రభుత్వ శాఖలు ముందుకు సాగాలని మంత్రులు ఎన్ఎండి ఫరూక్, సవితమ్మ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచనలు చేశారు.ఇస్తేమా కు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు భద్రతా ఏర్పాట్లు, రవాణా నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వైద్య
శిబిరాలు తదితర అంశాలపై మంత్రులు ఫరూక్, సవితమ్మ, రాంప్రసాద్ రెడ్డి లు అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు.ఇస్తేమా కు తరలి వచ్చే భక్తులు భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, కార్యచరణబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని మంత్రుల ఆదేశించారు.జాతీయ స్థాయి జమాతే తబ్లిగి ఇస్తేమా నిర్వహణ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.25 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించిన మైనారిటీ మంత్రి ఫరూక్ తెలిపారు.ఈ సమీక్ష లో డి ఆర్ ఓ విశ్వేశ్వర నాయుడు,కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ ఐర్విన్, ఏపి ఐఐసి జెడ్ఎం శ్రీనివాస మూర్తి,డిపివో రాజ్యలక్ష్మి, ఏపీఎస్పీడిసిఎల్ ఎన్ఈ రమణ,ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ ఏడుకొండలు, ఆర్ అండ్ బి ఎస్ఈ చంద్ర శేఖర్,నాయకులు బిటెక్ రవి,అమీర్ బాబు, తదితర అధికారులు, కమిటీ కార్యవర్గ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
