Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshకేంద్ర హోం మంత్రినీ కలిసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

కేంద్ర హోం మంత్రినీ కలిసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా సంబంధించి పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా ఆయనతో చర్చించడం జరిగింది. జిల్లాలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షణ, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు విస్తరణ, రవాణా, రోడ్లు విస్తరణ, రైల్వే మాలిక సదుపాయాలు వంటి అంశాలపై సీఎం రమేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లి చర్చించడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం సమగ్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారం మరింత అందించాలని ఆయనను కోరారు. ఈ భేటీలో హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందిస్తూ ఆంధ్ర రాష్ట్రం మరియు జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు సహకారం అందిస్తుందని కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడు అండదండలు ఉంటాయని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments