Monday, April 20, 2026
HomeDevotionalసుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజా మహోత్సవం పాల్గొన్న చొక్కాకుల దంపతులు.

సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజా మహోత్సవం పాల్గొన్న చొక్కాకుల దంపతులు.

సబ్బవరం జయ జయహే: అంతకాపల్లి గ్రామంలో లగుడువారి ఇల్లు దగ్గర ఉన్న స్వయంభూ శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య స్వామి కమిటీ ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు లక్ష్మీ దంపతులు, చొక్కాకుల జ్యోతి, చొక్కాకుల సమీర లను కమిటీ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించి రవితేజ శర్మ పంతులు నేతృత్వంలో అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

ఈ సందర్భంగా చొక్కాకులు వెంకటరావు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యస్వామి ఎంతో మహిమగల స్వామి అని తీరని కోరికలు తీర్చేస్వామి అని ముఖ్యంగా సంతానం, అపరి కృత సమస్యల పరిష్కారం చేసే స్వామి అని ప్రజల విశ్వాసం, అలాంటి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి వస్త్రములు సమర్పించే మహాభాగ్యం మా దంపతులకు కల్పించినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలం టిడిపి పార్టీ మాజీ అధ్యక్షుడు మిడతాన మహాలక్ష్మి నాయుడు దంపతులు, మాజీ జెడ్పిటిసి రొంగలి దేవుడుబాబు, లగుడు రవికుమార్ దంపతులు, వెన్నెల సత్యనారాయణ దంపతులు, లగుడు మహేష్ దంపతులు, గొంప అప్పలనాయుడు దంపతులు, సబ్బవరపు మోహన కృష్ణంనాయుడు, బోకం శ్రీను, లగుడు స్వామి, వెన్నల అప్పలనాయుడు, లగుడు సూరి, లగుడు దేముడు బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments