Thursday, April 23, 2026
HomeNewsసౌబిండికి జాతీయ జీవన సాఫల్య పురస్కారం

సౌబిండికి జాతీయ జీవన సాఫల్య పురస్కారం

తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్న డాక్టర్ సౌబిండి వెంకటలక్ష్మి ని హైదరాబాద్‌కు చెందిన జై బీమ్ యూనిటీ ఫౌండేషన్ వారు జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయుడు మాట్లాడుతూ, జీవన సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక నిర్థిష్ట రంగంలో చేసిన విశేష కృషికి సాధించిన విజయానికి గుర్తుగా ఇచ్చే అత్యున్నత గౌరవమని పేర్కొన్నారు. సాధారణంగా ఈ పురస్కారాన్ని వారి వృత్తిలో దశాబ్దాల కాలం పాటు కొనసాగి, ఆ రంగానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తులకు ఇస్తారని వివరించారు. ఇది కేవలం ఒక ఏడాదిలో సాధించిన విజయానికి ఇచ్చేది కాదని, జీవితాంతం చేసిన సేవలకు ఇచ్చే గుర్తింపు అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా జై బీమ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ వరప్రసాద్ డైరెక్టర్ ఆఫ్ జి.ఎస్.హెచ్.టి.ఎ, మాజీ మంత్రివర్యులు, సినీ ఆర్టిస్ట్ డాక్టర్ బాబు మోహన్, హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ “చైర్మన్ ప్రసన్నకుమార్, సినీ ఆర్టిస్ట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments