Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshసంస్కృతినే మతంగా కలిగిన ఏకైక జాతి భారతజాతి

సంస్కృతినే మతంగా కలిగిన ఏకైక జాతి భారతజాతి

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి,

శ్రేష్ఠమైన సంస్కృతినే మతంగా కలిగిఉన్న జాతి ప్రపంచంలో హిందువులేనని, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి వేరుకాదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. మిడుతూరు మండలం, రోళ్ళపాడు గ్రామంలో వెలసిన శ్రీ రామాలయంనందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. తి.తి.దే. ధర్మాచార్యులు ఆమంచి వేంకటేశ్వర శర్మ భక్తాదులందరితో సామూహిక సంకల్పపూర్వక పూజలు నిర్వహించి, గోవుయొక్క పవిత్రతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరెడ్డి వేంకట రామిరెడ్డి, మాజీ సర్పంచ్ నాగారెడ్డి రామస్వామి రెడ్డి, విశ్వహిందూ పరిషత్ ప్రముఖ్ ఎన్.చిన్న నారాయణ, అర్చకులు టి.మనోహర్ శర్మ, ఇ. వెంకటేశ్వర్లు గౌడు, ఇ. నారాయణ గౌడు, యోగి ఎల్లయ్యతో పాటు భజన మండలి సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments