` జనసేన సాధక్, ఐటీ టీం కో-ఆర్డినేటర్ అనిల్ కుమార్
పాడేరు నియోజకవర్గంలో జనసేన ఉద్యమి సభ్యత్వాలు భారీగా నమోదు చేసినట్టు జనసేన సాధక్, ఐటీ టీం కో-ఆర్డినేటర్ సీ.హెచ్ అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో తనకు అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళలు,సృజనాత్మకత అకాడమీ చైర్మన్,జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్యలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వెయ్యాలని,పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సభ్యత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ భావజాలాన్ని వివరించాలని పిలుపునిచ్చారు. జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకోవడం అంటే కేవలం ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం మాత్రమే కాదని, సమాజంలో గౌరవం, జనసేన కార్యకర్తలు ప్రజలకు సేవ చేయాలనే తపనతో ముందుకు వస్తారని ఒక నమ్మకం ఉందని, సమస్యల పై స్పందించి అవసరమైనప్పుడు సహాయం చేయడం వల్ల ఉద్యమి సభ్యులకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని తెలిపారు..
