Saturday, June 6, 2026
HomePoliticsAndhra Pradeshకుప్పకూలిన డ్రోన్

కుప్పకూలిన డ్రోన్

తప్పిన ప్రమాదం

అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా డ్రోన్ కూలిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని జి.మాడుగుల మండలం బొయితిలి సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు అత్యవసరమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెడ్ వింగ్ సంస్థ, ప్రభుత్వం సంయుక్తంగా డ్రోన్ సేవలను పరిశీలిస్తున్నాయి. రక్తం నమూనాలు, అత్యవసర మందులను వేగంగా తరలించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ ట్రయల్ రన్ చేపట్టారు. ఆ క్రమంలో బొయితిలి గ్రామ పరిసరాల్లో ఎగురుతూ కూలిపోయింది. ఈ డ్రోన్.. చెట్లపై పడింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments