బిజెపి దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ కార్యక్రమం మంగళవారం మాడుగులలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా మండల స్థాయిలో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా 90 రోజులు పాటు గ్రామాలలో కార్యకర్తలు చేపట్టవలసిన కార్యక్రమాలు , రాష్ట్రంలో బిజెపి చేస్తున్న కార్యక్రమాలు, సోషల్ మీడియా విధివిధానాలు, స్పెషల్ ఇంసెంటివ్ రివిజన్ వంటి వాటిపై తొలిరోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి కార్యకర్త సభ్యులు డాక్టర్ జీవీ సత్యనారాయణ హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మనకి బాత్ కార్యక్రమం సద్వినియోగపరచుకోవాలన్నారు. అలాగే సోషల్ మీడియా కన్వీనర్ కొణతాల ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రత్న భారతి తదితరులు కార్యకర్తలకు తగు సూచనలు చేశారు. మండల పార్టీ అధ్యక్షులు మేలిపాక స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పుట్టా గంగయ్య, మండల సంతోష్ సుబ్బలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి మండల సతీష్, వడ్డాది వరలక్ష్మి, గొల్లవిల్లి రాజేష్, రాజు, పి నాగేంద్ర, చల్లా సత్యనారాయణ, ఎస్ వెంకటరాజు, ఎం చాయారం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు
