Saturday, May 2, 2026
HomePoliticsAndhra Pradeshముస్లింలకు వాసుపల్లి రంజాన్ కానుక

ముస్లింలకు వాసుపల్లి రంజాన్ కానుక

రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ వైసిపి ముస్లిం నేతలు కార్యకర్తలతో మంగళవారం ఆత్మీయ కలయిక నిర్వహించారు. పండుగ అనంతరం కార్యాలయంలో వారితో కాసేపు ముచ్చటించారు. రూ.15,000తో పాటు స్వీట్ బాక్సులను రంజాన్ తోఫాగా అందజేశారు. కులమతాలకు అతీతంగా ఉన్న దక్షిణ నియోజకవర్గంలో ముస్లిం సోదరులతో ఉన్న తన బంధం బాల్యం నాటిదని గుర్తు చేశారు. ఇక్కడే పెరిగి చదువుకున్న నియోజకవర్గంలో ముస్లిం సోదరులు చూపిన ప్రేమ ఆప్యాయలతో ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచానని గుర్తు చేశారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంకై ఎదురుచూస్తున్న వారికి మంచి రోజులు రానున్నాయని ఈ సందర్భంగా వాసుపల్లి జోష్యం చెప్పారు. 39 వ వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్, స్టేట్ మాజీ డైరెక్టర్ షబీర బేగం,36 వార్డ్ అధ్యక్షుడు మహమ్మద్ షకీల్, సౌత్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాబ్జి, (మహమ్మద్ యాసీన్), సమక్షంలో ముస్లిం వైసీపీ కార్యకర్తలకు ఈ తోఫాను అందజేయడం జరిగిందని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments