` ఆలయ కమిటీకి హామీనిచ్చిన ప్రముఖ వాణిజ్య వేత్త, బీజేపీ నేత ఎంవీఆర్
పట్టణములోని డైట్ కాలేజ్ ఎదురుగా నిర్మిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు
సోమవారం దేవాలయ పనులను ప్రముఖ వాణిజ్యవేత్త ముత్యాల గార్మెంట్స్ అధినేత, బీజేపీ నాయకులు, సంఘ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్ ) పరిశీలించారు. వారికి ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానం పలికారు. బాలాలయంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంవిఆర్ ను కమిటీ సభ్యులు శాలువ తో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీవేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కొమ్మాలపల్లి చౌడేశ్వరీ నందన శర్మ మాట్లాడుతూ శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారు అమ్మవారి కృపతో సకల జనుల సంక్షేమం కోసం భారతదేశంలోనే ప్రప్రదంగా శ్రీ రాజ మాతంగి, వారాహి , సహిత శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సుమారు ఎకరా స్థలంలో నిర్మిస్తున్నామన్నారు. ఈ ఆలయ నిర్మాణం అంచనా దాదాపు రూ. 12.5 కోట్లు అని తెలిపారు. ఎంవిఆర్ మాట్లాడుతూ త్వరలో దేవాలయ నిర్మాణానికి తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేదసంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నదియా,హేమ, త్రినాధ్ ,ఎంవిఆర్ ట్రస్ట్ అనకాపల్లి ఇంచార్జ్ గైపూరి రాజు, యువసేన సభ్యులు, ఆలయ కమిటీ కే సి హెచ్ నందన శర్మ, నదియా, హేమా, త్రినాథ్, కోటేశ్వరరావు, రామకృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు.
